దర్శి ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక మీకోసం కార్యక్రమం…ప్రజలతో మమేకమైన పోలీస్ శాఖ
ప్రత్యేక పోలీస్ మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్న దర్శి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు.
దర్శిలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంకు 69 ఫిర్యాదులు
తొలి శుభోదయం న్యూస్ దర్శి పోలీస్ :-
ప్రజా ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించడం, పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం లక్ష్యంగా జిల్లా ఎస్పీ గారు, పోలీస్ అధికారులు సోమవారం దర్శి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శి పట్టణం మరియు చుట్టూ పక్కల ప్రాంతాల నుంచి వివిధ సమస్యలతో వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను ఎస్పీ గారు స్వీకరించి, తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.అలాగే, ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడిన ఎస్పీ గారు వారి సమస్యల పూర్వాపరాలను సమగ్రంగా తెలుసుకుని, వాటిని చట్టపరంగా పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. అనంతరం ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మీ కోసం’ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చట్ట ప్రకారం విచారణ జరిపి త్వరితగతిన న్యాయం అందించాలన్నారు. ఫిర్యాదులపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కావున ఆ పిర్యాదులపై తీసుకున్న చర్యలపై కూడా నివేదిక ఇవ్వవలసిందిగా పోలీసు అధికారులను ఎస్పీ గారు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పోలీసు వ్యవస్థను ప్రజలకు మమేకం చేయడంలో భాగంగా ఈ ప్రత్యేక మీకోసం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, దర్శి పట్టణం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా మహిళలు, వృద్ధులు వారి సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలు పడి ఒంగోలులోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి రాకుండా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. ప్రతి సోమవారం ఆల్టర్నేట్ గా అన్ని సబ్ డివిజన్ పరిధిలో మీకోసం కార్యక్రమం నిర్వహిస్తామని, అదే విధంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో కూడా యథావిధిగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. మీకోసం ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిచ్చి పూర్తి స్థాయి విచారణ జరిపి సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ప్రజలకు న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని ఎస్పీ గారు స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక మీకోసం కార్యక్రమంలో కుటుంబ కలహాలు, చీటింగ్, భర్త/అత్తారింటి వేదింపులు, భూ & ఆస్థి వివాదాలు మరియు ఇతర సమస్యలపై పిర్యాదులు అందాయి.అదే విధంగా ఈ రోజు ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, సింగరాయకొండ సిఐ శ్రీహరి నిర్వహించిన మీకోసం కార్యక్రమంకు 65 ఫిర్యాదులు అందినాయి. ఈ కార్యక్రమంలో దర్శి డిఎస్పీ బాలమురళి కృష్ణ, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, దర్శి సీఐ రామారావు,అద్దంకి అర్బన్ సీఐ సుబ్బరాజు, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జున రావు,చీమకుర్తి సీఐ ప్రసాద్ సబ్ డివిజన్ ఎస్సైలు పాల్గొన్నారు.