తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా పోలీసు ఎస్పీ గారి ఆదేశాల మేరకు, స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్ ద్వారా మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని తర్లుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మలచెరువు ప్రాంతంలో ప్రత్యేక డ్రోన్ నిఘా నిర్వహించారు.ఎస్‌ఐ తర్లుపాడు ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాల సహాయంతో ఊరేగింపు మార్గాలు, ప్రధాన కూడళ్లు, ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజల భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించారు.ప్రజలు శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని మార్కాపురం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.