సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని పకీర్‌పాలెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గ్రీనింగ్ & బ్యూటిఫికేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు, విద్యా సామగ్రి, మధ్యాహ్న భోజనం కోసం పళ్లాలు మరియు తరగతి గదులకు అవసరమైన వస్తువులను స్థానిక తెలుగు యువత అధ్యక్షుడు కరిముల్ల (ఢిల్లు) అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ ఎండీఓ డి. వెంకట్రావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో అమలవుతున్న ‘పి4’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. పకీర్‌పాలెం పాఠశాలను దత్తత తీసుకుని మౌలిక సదుపాయాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.వేల్పుల సింగయ్య మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే లక్ష్యమని, వారు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, అంబటి బ్రహ్మయ్య, రాంబాబు, స్థానిక నాయకులు రఫీ, రాజగోపాల్, గోపిరెడ్డి, బాపట్ల ప్రభాకర్, ఖాదర్ వలి, తల్లిదండ్రులు, పాఠశాల విద్యా కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *