అపర భగీరథుడు అయిదు కోట్ల ఆంధ్రుల గుండెల్లో కొలువైన సంక్షేమ సారధి, రైతన్నల పెన్నిధి ,కాంగ్రెస్ పార్టీ రథసారథి, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ. జయంతి సందర్భంగా రాష్ట్ర రాష్ట్ర అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ చైర్మన్, దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కైపు వెంకటకృష్ణారెడ్డి సారధ్యంలో రూపొందించిన పోస్టర్ను ఈరోజు హైదరాబాదులోని లోటస్పాండ్ లో వైఎస్ షర్మిల రెడ్డి గారి నివాసంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా మరియు ఇతర నాయకుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూలై నెల 8వ తేదీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని ,అదేవిధంగా ఇడుపులపాయలోని వైయస్ ఘాట్లో జరిగే జయంతి కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని ఆమె కోరారు ఈ సందర్భంగా ఈ పోస్టర్ను రూపొందించిన కైపు కృష్ణారెడ్డిని వైఎస్ షర్మిల రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *