తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి :-
కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి తిరుణాళ్ళ లో భాగంగా ఈరోజుఅమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో అమ్మవారి అలంకారం భక్తులకు కనువిందు చేసింది. ఆలయ ఈవో బైరాగి చౌదరి గ్రామోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోటు పెదబాబు, ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.