ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం: పాత సింగరాయకొండ హెచ్‌పీ పాఠశాలలో ఉపాధ్యాయులుగా విశిష్ట సేవలందించిన కొల్లూరు మస్తానయ్య పదవీ విరమణ సందర్భంగా పలువురు విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, ఆత్మీయులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా డీసీఈబీ సెక్రటరీ మర్రిబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ, మస్తానయ్య ఎంతో నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన ఆదర్శ ఉపాధ్యాయుడని, తన సేవా కాలంలో వేలాది మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చిన గొప్ప గురువుగా నిలిచారని కొనియాడారు. ఆర్థికంగా వెనుకబడిన అనేక మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించడంతో పాటు ఫీజులు చెల్లించి వారి ఉన్నత చదువులకు తోడ్పాటునందించి, వారిలో ఎంతో మందిని ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడేలా చేశారని పేర్కొన్నారు.
బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి అర్రిబోయిన రాంబాబు మాట్లాడుతూ, తాము విద్యార్థి దశలో ఉన్నప్పుడు మస్తానయ్య సార్ తమ ఇంటినే ఒక ఆశ్రమ పాఠశాలగా మార్చి ఎందరో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారి జీవితాలకు మార్గదర్శకులయ్యారని గుర్తు చేశారు.ఆవుల కోటేశ్వరరావు మాట్లాడుతూ, బీసీ ఉద్యమంలో మస్తానయ్య పాత్ర ఎంతో కీలకమని, మాజీ ఎమ్మెల్యే మోరుబోయిన మాలకొండయ్యతో కలిసి పలు సామాజిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని సమాజ సేవలో విశేష కృషి చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, ఆత్మీయులు పాల్గొని శ్రీ కొల్లూరు మస్తానయ్యను ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడుతూ పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఆవల కోటేశ్వరరావు, దాసూరు రాఘవయ్య, అంబటి బ్రహ్మయ్య, నర్రా కోటేశ్వరరావు ,గవిని శివ శంకర్ కీర్తి శ్రీనివాసరావు, వేల్పుల వెంకట్రావు, రమేష్, డబ్బుకొట్టు నాగేశ్వరరావు, బంకా మాల్యాద్రి, ఉమ్మడిప్రోలు శ్రీనివాసరావు నక్కా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *