తొలి శుభోదయం :-

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో గిద్దలూరు ZPHS గర్ల్స్ స్కూల్ కు చెందిన విద్యార్థిని రమ్య అసాధారణ ప్రతిభను ప్రదర్శించిన విషయాన్ని గిద్దలూరు గౌరవ శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి హృదయపూర్వకంగా అభినందించారు.హోమ్ మంత్రిగా వ్యవహరిస్తూ సభలో అడిగిన ప్రశ్నలకు ధైర్యంగా, స్పష్టంగా సమాధానాలు ఇచ్చిన రమ్య మాట్లాడిన తీరు, ఆత్మవిశ్వాసం, రాజకీయ అవగాహన అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంలో విద్యార్థుల ప్రతిభను చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రశంసలు అందించడం గిద్దలూరు నియోజకవర్గానికి గర్వకారణమని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పేర్కొన్నారు.విద్యార్థుల్లో దేశపాలన, ప్రజాసేవల పట్ల ఆసక్తి పెంపొందేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని, భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వేదికలపై మెరవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు.
విద్యార్థిని రమ్యకు, ఆమె తల్లిదండ్రులకు, పాఠశాల అధ్యాపకులకు ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *