తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామంలో జరుగనున్న పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ మరియు భద్రతా ఏర్పాట్లను ప్రకాశం జిల్లా పోలీసులు సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా సంబంధిత పోలీసు అధికారి, జరుగుమల్లి ఎస్‌ఐతో కలిసి పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు, వాహనాల రాకపోకల ఏర్పాట్లు, దేవాలయం పరిసరాల్లో చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.తిరునాళ్లకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, పార్కింగ్‌ను క్రమబద్ధంగా నిర్వహించాలని, భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసు సిబ్బందికి సూచించారు.