తొలి శుభోదయం కందుకూరు:-

స్థానిక టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(స్వయం ప్రతిపత్తి)లో రాజనీతి శాస్త్ర విభాగం మరియు ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు నరేంద్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి విద్యార్థి అందుకుని ప్రగతి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. ఐక్యుఏసి కోఆర్డినేటర్ డాక్టర్ పి.రాజగోపాల్ బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని హక్కులను ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని, రాజ్యాంగం సూచించిన విధులను పాటించాలని కోరారు. రాజనీతి శాస్త్ర అధ్యాపకులు కోటపాటి నరేష్ రాజా మాట్లాడుతూ భారతదేశంలో అధికారానికి మూలం ప్రజలని రాజ్యాంగ ప్రవేశిక సూచిస్తోందని, ఆ ప్రవేశిక స్ఫూర్తితో ప్రజలు చైతన్యవంతులు కావాలని, తద్వారా సమాజాభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజిని శాస్త్ర విభాగం మరియు ఎన్ఎస్ఎస్ విభాగం వారు సంయుక్తంగా జాతీయస్థాయి ఆన్లైన్ క్విజ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బంది రాజ్యాంగ ప్రవేశికను చదివి, రాజ్యాంగ విలువలు కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎన్.వి.శ్రీహరి, విమెన్ ఎంపవర్మెంట్ సెల్ కో-ఆర్డినేటర్ డాక్టర్.కే.సుజాత, వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు డాక్టర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *