తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
టంగుటూరు మండల తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ కమిటీ అధ్యక్షులు గా ఆర్యవైశ్య సంఘం నాయకులు బైసాని వెంకట సుబ్బారావును నియమించారు. ఈరోజు జరిగిన మండల పార్టీ సమావేశంలో టంగుటూరు మండల టిడిపి అధ్యక్షులు చదలవాడ. చంద్రశేఖర్ ,మాజీ సర్పంచ్ గ్రామ అభివృద్ధి ప్రదాత బెల్లం జయంత్ బాబు , సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, SC CELL రాష్ట నాయకులు బ్రాహ్మానందం తదితర సీనియర్ నాయకులు సమక్షంలో ప్రకటించారు. ఈ సందర్భంగా బైశాని వెంకట సుబ్బారావు మాట్లాడుతూ తనను వాణిజ్యభాగం అధ్యక్షులుగా నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, యువనేత నారా లోకేష్ కు, అధ్యక్షులు డూండీ రాకేష్ కు,కొండపి నియోజకవర్గ టిడిపి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మిత్రులు సుబ్బారావుకు అభినందనలు తెలిపారు.