ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ‘స్కై ఐ ప్రకాశం’ (Sky Eye Prakasam Project) ప్రాజెక్టులో భాగంగా టంగుటూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిసర ప్రాంతం మరియు అద్దంకి ఆటోనగర్ ప్రాంతాల్లో డ్రోన్ పర్యవేక్షణ నిర్వహించారు.డ్రోన్ నిఘా ద్వారా అనుమానాస్పద కదలికలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, బహిరంగ మద్యం సేవించడం, జూదం, మాదకద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాలు మరియు ఇతర నేరాలను గుర్తించి అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగించారు.ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాలను సమర్థవంతంగా నియంత్రించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాంతిభద్రతలను పరిరక్షించడమే ‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.ప్రజలు తమ పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *