కోవూరు నియోజకవర్గంలోని విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ప్రాధాన్యతగా తీసుకుని, దశలవారీగా అన్ని మౌలిక వసతులు సమకూర్చుతున్నాను.గురువారం కోవూరు మండలం లేగుంటపాడు జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో సీఎస్‌ఆర్‌, వి.పి.ఆర్ ఫౌండేషన్ సహకారంతో సుమారు రూ.4 లక్షల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించాను.దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఈ పాఠశాలకు కొత్త రూపు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది. పాఠశాల భవనాలకు నూతన రంగులు, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించే పనులను త్వరలోనే పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తాను.ఇప్పటికే దామరమడుగు, నార్త్ రాజుపాళెం పాఠశాలల్లో అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. పడుగుపాడు పాఠశాలలో కూడా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రతి విద్యార్థి మెరుగైన వాతావరణంలో చదువుకునేలా ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం.ఈ అభివృద్ధి కార్యక్రమాలకు వి.పి.ఆర్ ఫౌండేషన్ ద్వారా నిరంతరం సహకరిస్తున్న నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే సీఎస్‌ఆర్‌ నిధులు అందిస్తున్న దాతలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *