ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ నిర్వహించారు.ఈ సందర్భంగా రాజీకి అవకాశం ఉన్న కేసులను ఇరు పక్షాల సమక్షంలో చర్చించి, పరస్పర అవగాహనతో సామరస్యపూర్వకంగా పరిష్కరించేలా కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజలకు సత్వర, సులభ న్యాయం అందించడమే లక్ష్యంగా పోలీసు అధికారులు, న్యాయ అధికారులు సమన్వయంతో కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.చిన్నచిన్న వివాదాలను కోర్టు వెలుపల చట్టబద్ధంగా, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవడం ద్వారా సమయం, ధనం ఆదా కావడంతో పాటు సామాజిక సామరస్యాన్ని కూడా పెంపొందించవచ్చని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *