అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నృసింహ స్వామి వారి దివ్య ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారికి రెండు భుజాలు రొటేటరీ కప్ ఇంజ్యూరిస్ కి సంబంధించి నేడు ముంబైలో జరిగే ఆపరేషన్ విజయవంతం కావాలని కందుకూరు నియోజకవర్గ జనసేన నాయకులు కోరుకున్నారు . కందుకూరు నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మాలకొండ లో వారంలో శనివారం మాత్రమే దర్శనం ఇచ్చే ఈ ప్రాంత ప్రజల ఇలవేల్పు శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నృసింహ స్వామి వారిని దర్శించి పారదర్శక పాలన అందించే మేటి నాయకులు పవన్ కల్యాణ్ గారు త్వరగా కోలుకోవాలి. అలాగే ఆయన మీద కుహానా దుష్ట శక్తుల ప్రభావం పవన్ కల్యాణ్ గారి దరిదాపులకు చేరకూడదు అని లక్ష్మీ నృసింహ స్వామి వారిని వేడుకోవడం జరిగింది. తదనంతరం మాలకొండ ఆలయ ఈవో పి. శ్రీనివాసులు రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించడం జరిగింది. పై కార్యక్రమం లో పాల్గొన్న వారిలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ దేవళ్ళ భాస్కర్ రావు గారు మాజీ జిల్లా జనసేన కార్యక్రమాల కార్యదర్శి కొణిదెన శ్రీనివాసులు జనసేన నాయకులు మూలగిరి శ్రీనివాస్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *