తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మెగా లోక్ అదాలత్ సందర్భంగా మార్కాపురం జిల్లా పోలీసులు ఇరు పక్షాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సంబంధిత కేసుల్లో ఇరు పక్షాలతో చర్చించి, వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుని పరస్పర అవగాహనతో సామరస్యపూర్వకంగా వివాదాలను పరిష్కరించుకునేలా సూచనలు చేశారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను చట్టబద్ధంగా పరిష్కరించడం ద్వారా సమయం, ధనం ఆదా కావడంతో పాటు సామాజిక సామరస్యాన్ని కాపాడవచ్చని వివరించారు.ప్రజలు చిన్నచిన్న వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి మెగా లోక్ అదాలత్ వంటి వేదికలను సద్వినియోగం చేసుకోవాలని మార్కాపురం జిల్లా పోలీసులు సూచించారు.