తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి విచ్చేసిన మంత్రులకు ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి, శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రులు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.