google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

కందుకూరు సబ్ కలెక్టర్ గారి ఆఫీసు నందు ఇసుకకు సంబంధించిన వివాదము పైన రామనాథపురం గ్రామం, వెంకన్నపాలెం గ్రామం, దావ గూడూరు గ్రామం చింతలపాలెం గ్రామం పెద్దలను పిలిపించి వారికి ప్రభుత్వం విధివిధానాల ప్రకారం మాత్రమే ఇసుకను తీసుకోవాలని అట్లు కాక ఎవరైనా జెసిబిలను గాని మిషన్లు గానీ ఉపయోగించి ఇసుకను తీసినట్లైతే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొనబడతాయని శ్రీ కందుకూరు సబ్ కలెక్టర్ గారు తెలియజేసినారు. తదుపరి ఇసుకకు సంబంధించి ఎవరు కూడా ఎటువంటి గొడవలు చేసుకోవద్దని ఏదైనా విషయం ఉంటే తమ దృష్టికి తీసుకొని వచ్చినట్లయితే వాటిని పరిష్కరించుతాము అని అట్లు కాక ఎవరైనా గొడవలు పడిన యెడల వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొనుపడతాయని శ్రీ కందుకూరు డిఎస్పీ గారు తెలియజేసినారు. ఈ కార్యక్రమములో కందుకూరు సబ్ కలెక్టర్ గారు, కందుకూరు డీఎస్పీ గారు, కందుకూరు సిఐ గారు, మైనింగ్ అధికారులు, జరుగుమల్లి తహసిల్దార్ గారు, జరుగుమల్లి ఎస్ఐ గారు కందుకూరు రూరల్ పిఎస్ ఎస్ఐ గారు ఇతర అధికారులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed