తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఒంగోలులో ట్రాఫిక్ నియంత్రణను బలోపేతం చేయడానికి ట్రాఫిక్ సీఐ జగదీష్ అద్దంకి బస్‌స్టాండ్, సాగర్ సెంటర్ మరియు RTC సెంటర్ గేట్ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.రోడ్డు అడ్డంకులు సృష్టిస్తూ అనధికారికంగా ఆగిన ఆటోలపై తనిఖీలు చేసి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన వాహనాలపై జరిమానాలు విధించారు. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్ సేఫ్టీ, సక్రమ పార్కింగ్ మరియు ప్రజా రవాణా భద్రతపై కౌన్సెలింగ్ నిర్వహించి అవగాహన కల్పించారు.పౌరుల రవాణా సౌకర్యం మరియు భద్రత కోసం ఇలాంటి ట్రాఫిక్ డ్రైవ్‌లు తరచూ కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *