google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు పట్టణాలు, గ్రామాలు, వ్యాపార ప్రాంతాలు మరియు ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో ఫుట్ పట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, అనుమానాస్పద వ్యక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడమే ఈ ఫుట్ పట్రోలింగ్ ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.ప్రజలు తమ పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed