google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ఉపాధి హామీ పథకం పనిని పాత పద్దతి లోనే కొనసాగించాలి అని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో టంగుటూరు మండలం లోని మర్లపాడు గ్రామంలో పని ప్రదేశంలో ఉపాధి కూలీల తో కలసి నిరసన వ్యక్తం చేయటం జరిగింది.ఈ సందర్బంగా మోజెస్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి విబి జి రామ్ జి పేరుతో తీసుకొచ్చిన కొత్త చట్టం రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం మోపుతూ, పేదల పొట్ట కొట్టే విదంగా ఉన్నదని తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ పేరు తొలగించడం అన్యాయమని అన్నారు.గతంలో ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 90%, , రాష్ట్ర ప్రభుత్వాలు 10% నిధులతో ఈ పధకాన్ని విజయవంతం గా కొనసాగించారు అని తెలిపారు.ఈ కొత్త చట్టం వల్ల ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులు కేటాయించి న తరువాత మిగిలిన 60% నిధులను కేంద్రం విడుదల చేస్తుంది అని తెలిపారు. కొత్త గా వచ్చిన విబి జిరామ్ జి చట్టం వల్ల రాష్ట ప్రభుత్వాలు ఈ పథకానికి అయ్యే 40% నిధులు ఖర్చు పెట్టె స్థితిలో లేవు,కాబట్టి ఈ కరువు పని కాస్త పేదలకు దూరం అవుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ కొత్త చట్టాన్ని రద్దు చేసి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పదకాన్ని పాత పద్ధతి లోనే కొనసాగించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోజుకి 600 రూపాయలు ఇచ్చి 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేసారు. కొత్త చట్టానికి వ్యతిరేకంగా జరిగే పోరాటల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో ఉపాధి కూలీలు పాల్గొన్నారు….

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed