google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ‘స్కై ఐ ప్రకాశం’ (Sky Eye Prakasam) ప్రాజెక్ట్లో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొరంట్ల సెంటర్ వద్ద అత్యాధునిక డ్రోన్ సాంకేతికతతో ప్రత్యేక నిఘా నిర్వహించారు.ప్రజా భద్రతను మరింత పటిష్టం చేయడం, బహిరంగ మద్యపానం, జూదం, ట్రాఫిక్ ఉల్లంఘనలు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఈ డ్రోన్ సర్వైలెన్స్ చేపట్టారు. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అనుమానాస్పద కదలికలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు.ప్రజల సహకారంతో శాంతి భద్రతలను కాపాడుతూ, ఆధునిక సాంకేతికతను వినియోగించి నేరాల నియంత్రణకు ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed