google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ‘స్కై ఐ ప్రకాశం’ (Sky Eye Prakasam) ప్రాజెక్ట్లో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల్లో ఈవ్‌టీజింగ్ నివారణకు ప్రత్యేక డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు.మహిళలు, విద్యార్థినులు భయాందోళనలు లేకుండా విద్యాసంస్థలకు వెళ్లేలా, ప్రజా ప్రదేశాల్లో సురక్షిత వాతావరణాన్ని కల్పించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యం. డ్రోన్ కెమెరాల ద్వారా అనుమానాస్పద కదలికలు, ఈవ్‌టీజింగ్, అసాంఘిక కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన వెంటనే చర్యలు తీసుకునేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.మహిళల భద్రతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు కూడా మహిళల భద్రత విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఎక్కడైనా ఈవ్‌టీజింగ్ లేదా అనుమానాస్పద ఘటనలు గమనించినట్లయితే వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed