google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా పోలీసులు బహిరంగ మద్యపానం జరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బహిరంగ మద్యపానానికి ఉపయోగిస్తున్న ప్రదేశాలను గుర్తించి, అక్కడ పేరుకుపోయిన మద్యం సీసాలు, గ్లాసులు, ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు ఇతర చెత్తను తొలగించి పరిసరాలను పూర్తిగా శుభ్రం చేశారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు మరియు వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజా ప్రదేశాలను వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టవిరుద్ధమని, ఇటువంటి చర్యలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తాయని పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. బహిరంగ మద్యపానం, జూదం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడైనా గమనించినట్లయితే వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.ప్రజల సహకారంతో పరిశుభ్రమైన, సురక్షితమైన మరియు నేరరహిత సమాజ నిర్మాణానికి మార్కాపురం జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed