తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
Kvps, వ్యవసాయ కార్మిక సంఘాలు చేపట్టిన సామజిక శంఖారావం లో భాగంగా టంగుటూరు మండలం కొణిజేడు గ్రామంలో ఎస్ సీ, ఎస్ టీ కాలనీలలో సర్వే చేయటం జరిగింది.ఈ సందర్బంగా మోజెస్ మాట్లాడుతూ దళిత, గిరిజన కాలనీలు అభివృద్ధి లో బాగా వెనుక బడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఎస్ టీ లకు మంచి నీళ్లు, దళిత కాలనీల 2 కి స్మశాన స్థలం, మురుగు కాల్వలు, కరెంట్ స్తంబాలు, చెరువు అలుగు కాలువ నిర్మాణం, ఎస్ టీ లకు ఇళ్ళు, ఆన్లైన్ సమస్య ఇలా అనేక సమస్యలు సర్వే బృందానికి తెలియచేయటం జరిగింది అని తెలిపారు.250 దళిత, గిరిజన కుటుంబాలు ఉన్న కొణిజేడు గ్రామంలో కనీసం మౌలిక వసతులు కూడా లేక పోవటం దుర్మార్గం అని అన్నారు.ఈ సమస్య లను వెంటనే పరిస్కారం చేయాలని సర్వే బృందం నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి. మోజెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ బృందం లో ఎస్కె. మీరాస్, ఎమ్. కోటయ్య, టీ. రామకోటయ్య తదితరులు పాల్గొన్నారు.