తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్.యుగంధర్ గారు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ జి. నాగేశ్వరరావు గారు, అలాగే జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీస్ అధికారులు, సిబ్బంది “స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ప్రాంగణాలతో పాటు పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి, చెత్తను తొలగించారు. పనిముట్లతో పిచ్చి మొక్కలను తొలగించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్. యుగంధర్ గారు మాట్లాడుతూ, మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణం మానసిక ప్రశాంతతను పెంపొందించి, విధులను మరింత సమర్థవంతంగా, క్రమశిక్షణతో నిర్వర్తించేందుకు దోహదపడుతుందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అదే లక్ష్యంతో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం అధికారులు, సిబ్బందితో కలిసి స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొని, (SASA) ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఆర్ఐ సీతారామిరెడ్డి, ఆర్ ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.