రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సమాధానమిస్తూ, జల్ జీవన్ మిషన్ (JJM) 2.0ను డిసెంబర్ 2028 వరకు పొడిగించినట్లు ప్రకటించారు.ఈ పథకం ద్వారా దేశంలోని 19.36 కోట్ల గ్రామీణ కుటుంబాలకు సురక్షితమైన తాగునీటిని ఇంటింటికీ కుళాయి ద్వారా అందించడమే లక్ష్యమని తెలిపారు.జల్ జీవన్ మిషన్ 2.0 కింద మొత్తం వ్యయాన్ని రూ.3.60 లక్షల కోట్ల నుంచి రూ.8.69 లక్షల కోట్లకు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రాలతో ప్రత్యేక అవగాహన ఒప్పందాలు (MoUs), సుజలం భారత్ అనే జాతీయ డిజిటల్ ప్లాట్‌ఫారం, గ్రామాల వారీగా ప్రత్యేక సర్వీస్ ఏరియా ఐడీలు, నీటి వనరుల స్థిరత్వం, గ్రామపంచాయతీల భాగస్వామ్యం వంటి కీలక సంస్కరణలను అమలు చేయనున్నట్లువివరించింది.
ప్రతి గ్రామంలో జల్ ఉత్సవ్, జల్ అర్పణ్ కార్యక్రమాల ద్వారాప్రజలభాగస్వామ్యాన్ని పెంచడం, గ్రామ జల-పారిశుద్ధ్య కమిటీలను బలోపేతం చేయడం, నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణనుగ్రామపంచాయతీలకు అప్పగించడం, డిజిటల్ పర్యవేక్షణ, నీటి వనరుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
2026-27 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,631.07 కోట్ల తాత్కాలిక కేటాయింపు చేసినట్లు, ఇప్పటివరకు రూ.27.15 కోట్ల కేంద్ర వాటా విడుదల చేసినట్లు సమాధానంలోవెల్లడించిందిగ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడం, నీటి వనరులను దీర్ఘకాలికంగాపరిరక్షించడం, ప్రజల భాగస్వామ్యంతో నీటి నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేయడమే జల్ జీవన్ మిషన్ 2.0 ప్రధాన లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *