ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 60 ఫిర్యాదులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :-
ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్థన్ రాజు ఐపియస్.,గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా ఓఎస్డీ (అడ్మిన్) నవజ్యోతి మిశ్రా, ఐపీఎస్., గారు మరియు పోలీసు అధికారులతో కలిసి సోమవారం మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో “మీకోసం” (PGRS) కార్యక్రమం నిర్వహించారు.ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమగ్రంగా విచారణ జరిపి, ఫిర్యాదుదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని ఓఎస్డీ (అడ్మిన్) గారు ఆదేశించారు. వివిధ సమస్యలతో పోలీసు కార్యాలయాలకు వచ్చే బాధితులకు పోలీసు శాఖ భరోసాగా నిలవాలని, ప్రతి ఫిర్యాదును నమోదు చేసి, నిర్ణీత గడువులో పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఫిర్యాదుల కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, నడవలేని స్థితిలో ఉన్నవారికి ప్రత్యేక శ్రద్ధతో స్పందించి, వారి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాల్లో కూడా అందజేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్/జాబ్ ఫ్రాడ్, అత్తరింటి వేదింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు, మార్కాపురం సీఐ అల్తాఫ్ హుస్సేన్, త్రిపురాంతకం సిఐ అస్సన్, టీవీ పల్లి ఎస్ఐ శివ బసవరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.