తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ స్పెషల్ గ్రీవెన్స్ కార్యక్రమంలో టంగుటూరు అంబేద్కర్ నగర్‌లో నెలకొన్న మౌలిక సమస్యలను రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.అంబేద్కర్ నగర్‌లో మురుగునీటి కాలువలు లేకపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. అలాగే సుమారు 40 సంవత్సరాల క్రితం వేసిన మంచినీటి పైప్‌లైన్‌లు పూర్తిగా దెబ్బతినడంతో కాలనీవాసులకు తాగునీటి సరఫరా సక్రమంగా అందడం లేదని వివరించారు.
దళిత కాలనీల్లో కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఇప్పటికీ సమస్యలు కొనసాగుతున్నాయని పేర్కొంటూ, అంబేద్కర్ నగర్‌లో కొత్త మురుగునీటి కాలువలు, మంచినీటి పైప్‌లైన్‌లు ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ నగర్ యూత్ సభ్యులు క్రాంతి కుమార్, రాజు, చంద్ర, ధన, శ్రీకాంత్, కార్తీక్, వెంకటరావు, భరత్, అభిషేక్ తదితరులు పాల్గొని కాలనీవాసుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.