తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఒంగోలు డీఎస్పీ గారు ఎస్‌డీపీఓ కార్యాలయం, ఒంగోలులో సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సబ్ డివిజన్ పరిధిలో నమోదైన వివిధ కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారం, ఆస్తి నేరాలు, మహిళలు మరియు చిన్నారులపై నేరాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల కేసులు, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సమగ్రంగా సమీక్షించారు.అదేవిధంగా పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, బాధితులకు సత్వర న్యాయం అందేలా దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి అధికారి సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.ఈ సమావేశంలో ఎస్. కొండ సీఐ శ్రీ వై. శ్రీహరి గారుతో పాటు సబ్ డివిజన్‌కు చెందిన అధికారులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *