తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండలం పాకల గ్రామం లో పొలం పిలుస్తుంది కార్యక్రమం భాగంగా పాకాల గ్రామమును సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులైన ఈ .నిర్మల కుమారి గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎలినోవా ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని దానికి తక్కువ కాలపరిమితి గల పెసర మినుము పంటలను వేసుకోవాలని రైతులకు సలహా ఇచ్చినారు అలాగే పంటల బీమా కట్టుకోవాలని రైతులకు వివరించినారు తరువాత వ్యవసాయ అధికారి టి పూర్ణచంద్ర రావు గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం యూరియా డిఎపి ఎరువులను ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా తీసుకోవాలని అది ఎలా తీసుకోవాలి అంటే ముందుగా రైతులు రైతు సేవ కేంద్రంలో ఉన్న గ్రామ వ్యవసాయ సహాయకులను ద్వారా వాళ్ళ లాగిన్లు లొ పంటలను నమోదు చేసుకుని ఎరువులను కొనుగోలు చేయవలసిందిగా రైతులకు వివరించినారు తరువాత ఎఫ్ఎం టి వెంకటరమణ గారుమాట్లాడుతూ ఈ సంవత్సరం పి .ఎం .డి .ఎస్ కిట్స్ వేసుకోవాలని రైతులకు వివరించినారు ఈ కిడ్స్ కావలసిన రైతులు రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించవలసిందిగా తెలియజేయడమైనది తరువాత గ్రామ మత్స్య సహాయకులు మాట్లాడుతూ తమ పథకాలను గురించి రైతులకు వివరించినారు ఈ కార్యక్రమంలోవ్యవసాయ విస్తరణ అధికారి, గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు రైతులు పాల్గొనడం జరిగినది