తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గిద్దలూరు పోలీసులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి, వాటిని సంబంధిత యజమానులకు అప్పగించారు.మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదులపై వెంటనే స్పందించిన పోలీసులు, CEIR (Central Equipment Identity Register) మరియు ఇతర సాంకేతిక విధానాల ద్వారా ఫోన్లను ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చట్టపరమైన ప్రక్రియ పూర్తిచేసి వాటిని సంబంధిత యజమానులకు అందజేశారు.ఈ సందర్భంగా తమ విలువైన మొబైల్ ఫోన్లను తిరిగి పొందిన బాధితులు గిద్దలూరు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆస్తులను రక్షించడం, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడం కోసం మార్కాపురం జిల్లా పోలీసులు సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ సేవలందిస్తున్నారు.