ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఉదయం 10.00 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి రాజ్యసభ సభ్యులు డాll శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రితో డాll శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ స్వల్పంగా చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనకు కేంద్ర ప్రభుత్వంతో జరగనున్న సమావేశాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.ప్రభుత్వ అధికారిక పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పార్లమెంట్ హౌస్‌కు చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీద మస్తాన్ రావు గారి కార్యాలయము, నెల్లూరు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *