తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో జూదం, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు కొనసాగిస్తున్నారు.ఈ నేపథ్యంలో పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని విప్పగుంట గ్రామ ఎస్సీ కాలనీలో అక్రమంగా పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ గారు తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో 4 మంది పేకాట ఆడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.3,150/- నగదు మరియు 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జూదం, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు కుటుంబాల ఆర్థిక పరిస్థితులను దెబ్బతీస్తాయని, ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.ప్రజలు తమ పరిసరాల్లో జూదం, పేకాట లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్-112కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.