రామాయపట్నం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన పార్టీ ప్రతినిధులపై పెట్టిన కేసులను వివరించడం జరిగినది
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డితో జరిగిన పొగాకు రైతుల సమావేశం సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రత్యేకంగా మాట్లాడడం జరిగినది.కందుకూరు నియోజకవర్గంలో రైతుల ప్రధాన పంటగా ఉన్న పొగాకు గిట్టుబాటు ధర రాక, పెట్టిన పెట్టుబడులు కూడా రైతుచేతికి వచ్చే పరిస్థితి లేక దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారని దీనివలన రైతు తీవ్రంగా నష్టపోవాల్సీ వస్తుందని జగన్ కు వివరించి చెప్పడం జరిగినది.ఇప్పటికే మన పార్టీ ఆధ్వర్యంలో రైతులకు సంఘీభావంగా బోర్డును సందర్శించడం,వేలం అధికారులకు వినతి పత్రం సమర్పించడం, రైతుల పక్షాన నిలబడి మద్దతు ధర కోసం ఆందోళన చేయడం జరిగినది. రైతు ప్రతినిధులుగా వెళ్లిన మన పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ నాయకులతో తప్పుడు రిపోర్టు ఇప్పించి కేసులు నమోదు చేశారని ఆ వివరాలను అందించడం జరిగినది. పొగాకు రైతుకు గిట్టుబాటు ధర కల్పించే దానికి మన ప్రభుత్వంలో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన సంగతి జ్ఞప్తికి తెచ్చారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం రామాయపట్నం పోర్టును అత్యంత చౌకగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మటం చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు జరిపిన పోరాటాన్ని బుర్రా మధుసూదన్ యాదవ్ జగన్మోహన్ రెడ్డికి వివరించి చెప్పడం జరిగినది. చలో రామాయపట్నం కార్యక్రమంలో వైసీపీ నాయకులు పైన పోలీసులు ఒత్తిడి తెచ్చి కార్యక్రమానికి హాజరు కాకుండా నిర్బంధాన్ని ప్రయోగించడం దానిని సైతం ఎదుర్కొన్న వైసీపీ శ్రేణులు వేలాదిగా పోర్టు ముట్టడి కార్యక్రమానికి హాజరైన సంఘటన, పోలీసులను ఏర్పాటు చేసి కార్యకర్తలను అడ్డుకున్న తీరును పూసగుచ్చినట్లు వివరించి చెప్పారు. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిలబడి స్థానిక రైతులకు, యువతకు అండగా నిలిచిన కార్యకర్తలు 20 మందిపై పోలీసులు వీఆర్వో ద్వారా తప్పుడు రిపోర్టు తీసుకొని కేసులు కట్టారని ఆ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును గురించి జగన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగినది. ప్రభుత్వ రంగంలో దాదాపు 5 వేల కోట్లు పెట్టి మీరు నిర్మించిన రామాయపట్నం పోర్టును అమ్ముతున్నారని మీరు సంకల్పించిన ప్రయోజనం సిద్ధించే పరిస్థితి లేదని గుర్తు చేశారు.బుర్రామధుసూదన్ యాదవ్ చెప్పిన విషయాలను సానుకూలంగా విన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తెప్పించుకుంటున్నానని పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు గాని,పొగాకు రైతుకు గిట్టుబాటు ధర కల్పించే పోరాటంలో గాని,రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో గాని క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని అవసరమైతే మన పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి కార్యాచరణ కూడా ప్రకటిస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం దిగి రాకపోతే కందుకూరు ప్రాంతానికి వచ్చి రామాయపట్నం పోర్టు రైతులు, యువకులకు న్యాయం జరిగే వరకూ పోరాడుదామని,పొగాకు రైతుల సమస్యపై కందుకూరు కూడా వస్తానని తెలియజేశారు.