రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జీవో నెం. 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా నాయకులు పిసికేశవరావు కోరారు. కనిగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు నిర్వహిస్తున్న పెన్ డౌన్ నిరసన కార్యక్రమానికి ఆయన బుధవారం మద్దతు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణ విధివిధానాలను మేము వ్యతిరేకిస్తున్నామని, చట్టబద్ధతలేని ప్రైవేటు సంస్థల పరం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా దారుణమని అన్నారు. ఇలాంటి మార్పుల వలన అవకతకలు జరిగి ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని, ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా దస్తావేజులేఖరులు, వారిని నమ్ముకుని కంప్యూటర్ ఆపరేటర్లు, గుమస్తాల జీవనభృతి కోల్పోతారని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి జీవో నెం. 396ను రద్దు చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో లో సిఐటీయూ మండల కన్వీనర్ పి నరేంద్ర నాయకులు ప్రసాద్ , బ్రహ్మయ్యా,ఒబయ్యా, ఆడివయ్య , శ్రీను,ప్రసంగి ,మార్క్ , రోశయ్య, గరటయ్య తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *