పెద్దారవీడు మండల విద్యాశాఖ అధికారిగా (ఎంఈఓ) సమర్థవంతంగా సేవలందిస్తున్న శ్రీ ప్రగడ శ్రీనివాసులు ,ని మార్కాపురం డివిజన్ డిప్యూటీ విద్యాశాఖ అధికారిగా (డిప్యూటీ ఈఈఓ) నియమించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎస్. సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పెద్దారవీడు మండలంలో విద్యా రంగ అభివృద్ధికి శ్రీ ప్రగడ శ్రీనివాసులు విశేష కృషి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను మెరుగుపరచడం, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం, ప్రభుత్వ బడులో విద్యార్థుల రోల్ పెంచడం,బోధన-అభ్యసన ప్రక్రియను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉపాధ్యాయులతో సమన్వయం సాధిస్తూ ప్రభుత్వ విద్యా కార్యక్రమాలు సమర్థవంతంగా అమలయ్యేలా నిరంతరం పర్యవేక్షించారు.మండల విద్యాశాఖ అధికారిగా తన పదవీకాలంలో ప్రభుత్వ పాఠశాలలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ బోధన ప్రమాణాలను సమీక్షించారు. విద్యార్థుల అభ్యాస ఫలితాల మెరుగుదలకు అవసరమైన సూచనలు, మార్గదర్శకాలను ఉపాధ్యాయులకు అందించడంతో పాటు, పాఠశాలల సమగ్ర అభివృద్ధికి పలు వినూత్న కార్యక్రమాలను అమలు చేశారు. విద్యా వ్యవస్థ బలోపేతం, నాణ్యమైన విద్య అందరికీ అందేలా కృషి చేయడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.

శ్రీ ప్రగడ శ్రీనివాసులు డిప్యూటీ విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా మార్కాపురం డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, ప్రభుత్వ విద్యా సంస్కరణల సమర్థ అమలుకు మరింత ఊతం లభిస్తుందని విద్యాశాఖ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు మరియు విద్యావేత్తలు శ్రీ ప్రగడ శ్రీనివాసులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, నూతన బాధ్యతల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు…..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *