ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు,కందుకూరు డీఎస్పీ కార్యాలయంలో కందుకూరు డీఎస్పీ గారు పట్టణంలోని ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీలు ముద్రించే సమయంలో చట్టపరమైన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.అనుమతులు లేని, అభ్యంతరకరమైన, రెచ్చగొట్టే లేదా సామాజిక శాంతి భద్రతలకు భంగం కలిగించే ఫ్లెక్సీలను ముద్రించరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, ఎన్నికల సంఘం మరియు పోలీసు శాఖ సూచనలను కచ్చితంగా అనుసరించాలని, ప్రతి ఫ్లెక్సీ ముద్రణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రజలలో శాంతి, సామరస్యం నెలకొనేలా ప్రింటింగ్ ప్రెస్ యజమానులు పోలీసు శాఖకు సహకరించాలని డీఎస్పీ గారు కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *