తొలి శుభోదయం న్యూస్ కంభం:-
భారత మాజీ రాష్ట్రపతి, డాక్టర్ ఏపీజే. అబ్దుల్ కలామ్ వర్ధంతిని కంభం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గోళ్ళ సుబ్బరత్నం(బాబు) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న అబ్దుల్ కలామ్ విగ్రహానికి ఎం.ఈ.ఓ అబ్దుల్ సత్తార్ తో కలిసి పూలమాలలతో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన వక్తలు కలామ్ ఈ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన జీవన విధానం భావి తరాలకు ఆదర్శం అని, ఎక్కడో తమిళనాడు లోని మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకొని ఒక శాస్త్రవేత్తగా, మేధావిగా, భారత రాష్ట్రపతిగా శిఖరాగ్రానికి ఎదిగిన భరతమాత ముద్దు బిడ్డ కలామ్ అని ఆయన సేవలను, గొప్ప వ్యక్తిత్వాన్ని కీర్తించారు.సీనియర్ లయన్ సభ్యులు సయ్యద్ జాకీర్ హుస్సేన్ కార్యక్రమ కర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో మరో లయన్ సభ్యులు, అదే ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు గూటూరి సత్య రామారావు తన సొంత నిధులతో విద్యార్థులకు ఉచితంగా పలకలు, ఎక్కాల పుస్తకాలు మరియు బోధన సామాగ్రి అతిధుల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ తిరుమలయ్య, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, హజరత్ గూడెం మాజీ సర్పంచ్ మహబూబ్ పీరా, కంభం మాజీ ఉప సర్పంచ్ సయ్యద్ ఖాసీం, కంభం ఎంపీటీసీ 2 షేక్.రఫీ, విశ్రాంత ఉపాధ్యాయులు అబ్దుల్ కలామ్,జలీల్, ముస్లిం పెద్దలు, లయన్స్ క్లబ్ సభ్యులు ఐన విశ్రాంత ఎస్.ఐ కొండయ్య, కంభం మండలం స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామం డిప్యూటీ ఎంపీడీఓ దేవరశెట్టి.బ్రహ్మయ్య, పగడాల పాండు, తాటికొండ కాశయ్య, వెంకట రావు, క్లబ్ కోశాధికారి నాగేశ్వరరావు, క్లబ్ కార్యదర్శి న్యాయవాది ఎం.మహబూబ్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.