ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా.. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో నాలుగు రోజుల నుంచి పర్యటిస్తున్నారు. అక్కడినుంచి విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకకు భారీగా జన సమీకరణ జరిపేందుకు ఏర్పాట్లు చూస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ,కూటమి పార్టీల నేతలతో మాట్లాడి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నరసన్నపేటలో ఎమ్మెల్యే రమణమూర్తి గారితో కలిసి ఈరోజు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఇంటూరి నాగేశ్వరరావు నిర్వహించారు. గ్రామాల వారీగా ప్రజలను ఆహ్వానించడం, వాహనాల కేటాయింపు, ప్రయాణం మధ్యలో సౌకర్యాలు, సభ వద్ద వాహనాల పార్కింగ్, ఇతర ఏర్పాట్లపై చర్చించారు. ఒక్కొక్క బస్సుకు కోఆర్డినేషన్ అధికారిని నియమించారు. బస్సు తిరిగి గ్రామానికి చేరేవరకు జాగ్రత్తగా ఉండాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రధాని పర్యటనను విజయవంతం చేసేలా పనిచేయాలని నాగేశ్వరరావు గారు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *