ప్రకాశం జిల్లా, కందుకూరు డివిజన్ పరిధిలోని విప్పగుంట రోడ్డులో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం స్టీల్ లంచ్ బాక్సుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి కార్యదర్శి శీలం వెంకటేష్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ఉప్పుచెరువులోని నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం పాస్టర్ మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు; వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.” అనే దేవుని సందేశాన్ని తెలియజేశారు. అనంతరం శీలం కోటేశ్వరి గారి సహకారంతో పాస్టర్ మహేష్ చేతుల మీదుగా విద్యార్థులకు స్టీల్ లంచ్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్‌బాబు, వేణుబాబు, శివ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *