ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, జూదం ఆడడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా ప్రత్యేక నిఘా నిర్వహిస్తున్నారు.ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, అనుమానాస్పద ప్రాంతాలపై డ్రోన్ల సహాయంతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. బహిరంగంగా మద్యం సేవించడం, జూదం నిర్వహించడం లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి చట్టవిరుద్ధ కార్యకలాపాల సమాచారాన్ని వెంటనే అందించాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *