తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం పట్టణంలో విద్యా విభాగం ఆధ్వర్యంలో బి.పాండురంగ విఠల్ గారి ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి గిద్దలూరు మాజీ శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులు,విద్యా సిబ్బందిని ఘనంగా సన్మానించి, విద్యారంగానికి వారు అందించిన సేవలను అభినందించారు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నా రాంబాబు పేర్కొన్నారు.పదవీ విరమణ అనంతరం వారు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యాశాఖ సిబ్బంది,విద్యావేత్తలు,ప్రజాప్రతినిధులు,నాయకులు,అభిమానులు తదితరులు పాల్గొని ఉద్యోగ విరమణ పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.