ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా
ప్రస్తుత పరిస్థితులు మరియు శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా, కందుకూరు సబ్-డివిజన్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది.
ఎవరైనా ముందస్తు అనుమతి లేకుండా నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, సభలు, ధర్నాలు మరియు ఊరేగింపులు నిర్వహించడానికి నిషేధించడమైంది. ఎవరైనా నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, సభలు, ధర్నాలు మరియు ఊరేగింపులు నిర్వహించడానికి ముందుగా అనుమతి తీసుకోవలెను.
ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి నట్లు అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకొనబడును.కావున, ప్రజలు అందరూ పోలీసు శాఖకు సహకరించి, కందుకూరు సబ్-డివిజన్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించవలసిందిగా కోరడమైనది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *