సముద్ర కోతకు గురవుతున్న పల్లెపాలెం. భయాందోళనతో నిస్సహాయ స్థితిలో పల్లెకారులు.
సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళనబాట పట్టిన పల్లెకారులు
న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన సబ్ కలెక్టర్ , దామోదర హిమ వంశీ
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
సముద్ర కోతకు గురి అవుతున్న రామాయపట్నం పల్లెపాలెం ను, పోర్టు నిర్వాసిత గ్రామంగా చేర్చి, పల్లెకారులను ఆదుకోవాలని, సిపిఎం గుడ్లూరు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి జి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాడు , కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద, రామాయపట్నం పల్లె కార్లు ధర్నా నిర్వహించారు.., ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్ఏ గౌస్ పాల్గొని ప్రసంగించారు. అనంతరం సబ్ కలెక్టర్ శ్రీ దామోదర హిమవంశి గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ కాపు, సుధాకర్, మునిశేఖర్, రాసాని ప్రసాద్, రాములు మాట్లాడుతూ, రామాయపట్నం పోర్టు లో, రామయపట్నం అనే పేరు , ఉంది గాని, రామాయపట్నం ప్రజలకు మాత్రం ఒరిగేదేమీ లేదని, తీవ్రమైన నష్టం మాకు జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సముద్రం అలలు ఉప్పొంగి, 150 మీటర్లు వచ్చిందని, దీనివలన మా పల్లె మొత్తం కోతకు గురి అవుతుందని, చెట్లు కరెంటు స్తంభాలు పడిపోతున్నాయని, అర్ధరాత్రి పూట అలలు ఉవ్వెత్తున లేస్తే, మా ప్రాణాలు సముద్రంలో కొట్టుకుపోవటం ఖాయమని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు గారు, సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని, రామాయపట్నం పోర్టు నిర్వాసిత గ్రామంగా మా పల్లె పాలన్నీ చేర్చి అక్కడినుండి మమ్ములను తరలించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఈ ధర్నా కార్యక్రమంలో, సిపిఎం గుడ్లూరు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి జి వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు ఎస్ఏ. గౌస్, పల్లెపాలెం నాయకులు, కాపు సుధాకర్, రాసాని ప్రసాద్, ఆర్ శ్రీను, ఆర్ రాములు, పిన్ని శ్రీనివాసులు, మునిశేఖర్, సుల్తాన్ బాబు, మహిళలు, సింగోతు ప్రభావతి, ఏ గోవిందమ్మ, ఆర్ పోలమ్మ, చాపల సీతారావమ్మ, ఏ జయమ్మ, తంబు మీరమ్మ, టి వెంకటేశ్వరమ్మ, ఆర్ సీత, నారాయణమ్మ, వరలక్ష్మి, పీతా సుశీల పాల్గొన్నారు.