తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
ముత్తరాసిపాలెంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహణ అంబేద్కర్ నగర్, ముత్తరాసిపాలెంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లిపాల ప్రాముఖ్యత, నవజాత శిశువులకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎం.డి.ఎం. భాస్కర్‌రావు, ఎం.ఎల్.హెచ్.పీ. అనూరాధ, ఏ.ఎన్.ఎం. ఎస్.కె. నసీమూన్, అంగన్‌వాడీ కార్యకర్తలు పావని, అంకమ్మ, ఆశా కార్యకర్తలు సర్లా, ఈశ్వరి, జయశ్రీ పాల్గొని గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారమని, పుట్టిన గంటలోపు తల్లిపాలు ప్రారంభించడం, మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం ద్వారా శిశువుకు మెరుగైన ఆరోగ్యం, రోగనిరోధక శక్తి లభిస్తుందని ఆరోగ్య సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో స్థానిక మహిళలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొని ఆరోగ్య సూచనలు తెలుసుకున్నారు.