ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 74 ఫిర్యాదులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
పబ్లిక్ గ్రీవెన్స్‌లో స్వీకరించిన ప్రజా ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు చేపట్టి, ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారం చూపాలని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు, పోలీస్ అధికారులతో కలిసి ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (మీకోసం)’ను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజా ఫిర్యాదుల యొక్క వ్రాతపూర్వక అర్జీలను ఎస్పీ గారు మరియు పోలీస్ అధికారులు స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి వారి ఫిర్యాదుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు. అందిన ఆయా ఫిర్యాదులపై జిల్లా ఎస్పీ గారు సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి మీకోసంలో అందిన ఫిర్యాదులపై తక్షణ విచారణ చేపట్టి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోని భాధితులకు న్యాయం అందించాలని, జవాబుదారీతనంతో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా నిర్ణీత గడువులో ఫిర్యాదులు పరిష్కారించాలని అధికారులను ఎస్పీ గారు ఆదేశించారు.ఫిర్యాదు చేయడానికి వచ్చే వృద్ధులు, నడవలేని పరిస్థితిలో ఉన్నవారి సమస్యలను ప్రత్యేకంగా పరిశీలనలోకి తీసుకొని, సంఘటన స్థలాలను సందర్శించి చట్టప్రకారం సత్వర న్యాయం అందించాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ గారు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్, అత్తరింటి వేదింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యన్.యుగంధర్ బాబు, చీమకుర్తి సీఐ ప్రసాద్, కందుకూరు సీఐ అన్వర్ బాషా, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జున రావు, ప్యానెల్ అడ్వొకేట్ బి.బాలాజీ సింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై యాస్మిన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
