ఈ అంశాలే లక్ష్యంగా… తక్కువ ధరకు నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా
ప్రత్యేక రైస్‌ అవుట్ లెట్‌ స్టోర్స్ ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 115 రైతుబజార్లు, 500 రైస్ మిల్లుల వద్ద కౌంటర్లను నిర్వహిస్తోంది.
కందుకూరు పట్టణంలో రైతుబజార్‌ వద్ద ఏర్పాటుచేసిన కౌంటర్ లో బియ్యం విక్రయాలను గౌరవ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. పలువురు వినియోగదారులకు బియ్యం సంచులు అందజేశారు. ఓగూరు వద్ద విష్ణు సాయి రైస్‌ ట్రేడర్స్‌(రైస్ మిల్లు) వద్ద కూడా మరో కౌంటర్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
బహిరంగ మార్కెట్లో స్టీమ్డ్ బియ్యం కిలో 62 రూపాయలు ఉండగా, పది రూపాయలు తగ్గించి 52 రూపాయలకు అందిస్తున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. అలాగే బిపిటి బియ్యం కిలో 58 నుంచి 50 రూపాయలకు తగ్గించి ఇస్తున్నట్లు చెప్పారు. తెల్ల రేషన్ కార్డ్ కలిగిఉన్నవారు, తమ ఆధార్ కార్డును చూపించి ప్రతి కార్డుపై 10 కిలోల బియ్యం పొందవచ్చని ఎమ్మెల్యే సూచించారు.
పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాయపాటి సుభాషిని, పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, తహసిల్దార్ మురళి, ఏఎంసీ సెక్రటరీ రామాంజనేయులు, ఎస్టేట్ ఆఫీసర్ స్వరూపారాణి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాదాల వెంకటేశ్వర్లు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, రాష్ట్ర కమిటీ నాయకులు షేక్ రఫీ, నాదెళ్ల వెంకటరమణయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ సలాం, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ, క్లస్టర్ ఇంచార్జ్ వడ్డెళ్ళ రవిచంద్ర, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు అల్లం వెంకటేశ్వర్లు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ముచ్చు శ్రీను, పార్టీ నేతలు రాయపాటి శ్రీను, పలువురు వార్డు అధ్యక్షులు, పచ్చవ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *