నెల్లూరులోని రోటరీ క్లబ్ కళ్యాణ మండపంలో ఆదివారం యం.వి.రావు ఫౌండేషన్, అర్తాల అల్లెయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుల జాతీయ పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దివంగత పింగళి వెంకయ్య జన్మదినం, అర్థాల అల్లయ్య వర్ధంతి ని పురస్కరించుకొని వివిధ రంగాలకు చెందిన వారికి జాతీయ పురస్కారాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వివిధ విభాగాలు చెందిన 130 మంది కళాకారులకు, సేవా సంస్థలకు, ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలను మెమెంటో తో పాటు ప్రశంస పత్రాలు కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే జాతీయ పురస్కారాలు అందుకున్న పలువురు కళాకారులు ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ లీలా మోహన్ కృష్ణ కు, అర్థాల అల్లయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అర్థాల కేశవులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎం. వి.రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, అర్థాల అల్లెయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అర్థాల కేశవులు గార్ల చేతుల మీదుగా పేదలకు వివిధ రకాల సేవలను అందిస్తున్న PVM 22 ఫౌండేషన్ కందుకూరు మరియు ఒంగోలు అధ్యక్షులు.. టంగుటూరు మండలం M. నిడమలూరు గ్రామ నివాసి శ్రీ పబ్బిశెట్టి సుదర్శన్ రావు గారికి వారి సేవలను గుర్తించి జాతీయ స్వాతంత్ర సమరయోధుల సేవా రత్న పురస్కారం 2026 తో షీల్డ్ ప్రశాంశా పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మాట్లాడుతూ మేము చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తున్న దాతలకు మరియు ఎమ్ వి ఆర్ ఫౌండేషన్ గారికి ధన్యవాదములు తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *