తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), కందుకూరు కు చెందిన విద్యార్థులు మరొకసారి అఖిల భారత స్థాయి పరీక్షల్లో విజయం సాధించారు. జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ కౌన్సిల్ (NCERT) బిఈడి ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎంట్రన్స్ పరీక్షలో టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన బి ఎ స్పెషల్ ఇంగ్లీష్ విద్యార్థులు కె.శివకుమార్, ఆర్ .మహేష్ అత్యున్నత ప్రతిభ కనబరిచి మంచి ర్యాంకులు సాధించారు.
కె. శివకుమార్, ఓబీసీ కేటగిరీలో జాతీయస్థాయిలో రెండవ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో మొత్తం మీద నాలుగో ర్యాంకు, జాతీయస్థాయిలో 93 వ ర్యాంకు సాధించడం జరిగింది.ఆర్ .మహేష్, ఎస్సీ కేటగిరీలో జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు, మొత్తం మీద రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 146 ర్యాంకు సాధించడం జరిగింది. జాతీయస్థాయి పరీక్షలో గ్రామీణ ప్రాంతమైన కందుకూరు విద్యార్థులు, అది కూడా కేవలం డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పోటీపడి మెరుగైన ర్యాంకులు సాధించడం ఎంతో సంతోష దాయకమని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రవి కుమార్ తెలియజేశారు.
ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక, అధ్యాపకేతర బృందం ఈ విద్యార్థులను అభినందించారు. అదేవిధంగా తమ కళాశాలకు చెందిన బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్ విద్యార్థిని ఎస్ కే .సైదాబీ, పీజీ ఎంట్రన్స్ టెస్ట్ లో ఎం కామ్ విభాగంలో రాష్ట్రస్థాయిలో 35వ ర్యాంకు సాధించిందని, ఆ విద్యార్థిని కూడా కళాశాల అభినందిస్తుందని ప్రిన్సిపాల్ తెలియజేశారు. టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కందుకూరు మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులను అక్కున చేర్చుకొని వారిలో ఉన్న ప్రతిభను వెతికి తీసి, వారి భవిష్యత్తుకి బంగారు బాట వేసే విధంగా విద్యా బోధన చేస్తుందని ప్రిన్సిపాల్ గారు ఈ సందర్భంగా తెలియజేశారు. తమ దగ్గర ఉన్న అనుభవం కలిగిన, ఎంతో జ్ఞానవంతులైన అధ్యాపక బృందం యొక్క కృషి వలన విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు మరియు విద్యాబోధన అందించ గలుగుతున్నామని, ప్రిన్సిపాల్ తెలియజేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లు జరుగుతున్నాయని, విద్యార్థినీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు.