సిఐటియు,ఎఐటియుసి, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైల్ భరో జయప్రదం చేయాలని, మన రాష్ట్రంలో నియోజకవర్గ కేంద్రాలలో ఈ సందర్భంగా రాస్తారోకోలు నిర్వహించాలన్న పిలుపు లో భాగంగా,ఈ రాస్తారోకో ను కందుకూరు పట్టణంలో నిర్వహించాలని సిఐటియు, ఏఐటియుసి, రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈరోజు దాచూరి.రామిరెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘాల నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో సిఐటియు జిల్లా నాయకులు ఎస్.ఏ. గౌస్, ఏఐటియుసి కందుకూరు నియోజకవర్గ గౌరవాధ్యక్షులు బూసి సురేష్ బాబు మాట్లాడారు. నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యవసాయ కార్మిక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు వలన ప్రజలందరి జీవనంపై ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొన్నారు. ఈ విధానాలపై ఐక్యంగా గళమెత్తాలని నిర్ణయించాయి. అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలని, కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 31 వేలు ఇవ్వాలని, అంగన్వాడి, ఆశా,మిడ్డే మిల్స్, వివో ఏ, స్కూల్ స్వీపర్స్, పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, భవన నిర్మాణ, ఆటో, పి టి పి, ముఠా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అన్ని పంటలకు ఉత్పత్తి ఖర్చుపై అదనంగా 50% కలిపి మద్దతు ధర చెల్లించాలని, పొగాకు రైతులను ఆదుకోవాలని, హామీ పనులను 200 రోజుల కల్పించి, రోజుకు 700 కనీస వేతనం ఇవ్వాలని, పట్టణాలలో ఉపాధి హామీ పనులను కల్పించాలని, దళితులకు స్మశాన స్థలాలను కేటాయించి, స్మశాన వాటికలో నిర్మించాలని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, కార్పొరేట్ల కోసం రైతుల నుండి చేస్తున్న బలవంతపు సేకరణ ను ఆపాలని, ఐరన్ ఓర్ ను కార్పొరేట్లకు అప్పచెప్పలనే ప్రతిపాదనను ఉపసంహరించాలని తదితర డిమాండ్లతో ఆగస్టు 10న ఉదయం 10 గంటలకు కందుకూరులో జరిగే రాస్తారోకో కార్యక్రమానికి కందుకూరు నియోజకవర్గం లోని అన్ని గ్రామాల నుండి, పట్టణంలో అన్ని వార్డుల నుండి కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, దళితులు, అసంఘటిత రంగ కార్మికులు, స్కీం వర్కర్లు హాజరుకావాలని నాయకులు కోరారు.ఈ ప్రెస్ మీట్ లో సిఐటియు జిల్లా నాయకులు జీవీబీ కుమార్, సిఐటియు వలేటివారిపాలెం మండల కో కన్వీనర్ ఎస్ డి గౌస్ బాషా, ఏ ఐ టి యు సి కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి వై. ఆనంద్ మోహన్, కందుకూరు నియోజకవర్గ ఏఐటీయూసీ నాయకులు ఉప్పుటూరి. మాధవరావు, జమ్మలమడుగు రవి, చిన్న బ్రహ్మయ్య,కొచ్చర్ల మురళీకృష్ణ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం కందుకూరు మండల నాయకులు డి ఎం రాయుడు తదితరులు పాల్గొన్నారు